తెలంగాణలో కొత్తగా 247 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 247 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. అలాగే గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1659కి చేరింది. తాజా కేసులతో కలిపిఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య్య 3,01,769కి చేరింది. దీనిలో 2,98,009 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,101 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.