తెలంగాణలో కొత్త‌గా 313 కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 313 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. వీటిలో 2,98,262 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 2,434 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1664కి చేరిందని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.