తెలంగాణలో కొత్తగా 346 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,135కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
2,82,574 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5000 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కొత్తగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1561కి చేరింది.