తెలంగాణలో కొత్తగా 753 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వకు 41,991 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 753 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,68,418కి చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశాఖ శనివారం ఉదయం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు 2,56,330 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,667 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో కొత్తగా రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1451కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 952 మంది కోలుకున్నారని కరోనా బులెటిన్ పేర్కొన్నది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 53,74,141కి చేరింది.