తెలంగాణలో బాణాసంచా నిషేధం.. సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్ : పటాకులపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పటాకుల అమ్మకాలు, వినియోగాన్నినిషేధించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవో-1777 జారీ చేసింది. పటాకుల దుకాణాలు తక్షణమే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.