తెలంగాణలో 1,440 కొత్త కేసులు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 1,440 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,50,331 కు చేరింది. 24 గంటల్లో ఐదు మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,377కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,481 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,29,064 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 42,673 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 46,18,470 కు చేరింది.
జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 278, ఆదిలాబాద్ 13, భద్రాద్రి కొత్తగూడెం 97, జగిత్యాల్ 27, జనగాం 14, జయశంకర్ భూపాలపల్లి 17, జోగులమ్మ గద్వాల్ 9, కామారెడ్డి 29, కరీంనగర్ 68, ఖమ్మం 91, కొమరం భీమ్ అసిఫాబాద్ 10, మహబూబ్ నగర్ 19, మహబూబాబాద్ 16, మంచిర్యాల్ 31, మెదక్ 17, మేడ్చల్ మల్కాజ్గిరి 133, ములుగు 27, నాగర్ కర్నూల్ 28, నల్గొండ 70, నారాయణ్‌పేట్ 4, నిర్మల్ 21, నిజామాబాద్ 25, పెద్దంపల్లి 28, రాజన్న సిరిసిల్ల 17, రంగారెడ్డి 112, సంగారెడ్డి 31, సిద్ధిపేట్ 42, సూర్యాపేట 48, వికారాబాద్ 10, వనపర్తి 18, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ 39, యాద్రాది భువనగిరి 28 కేసులు నమోదయ్యాయి.