తెలంగాణ‌లో అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు.. ఉత్త‌ర్వులు జారీ

హైద‌రాబాద్‌: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్థికంగా వెనుకబడినవర్గాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్‌లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. 19 రాష్ర్టాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నాయి. తెలంగాణలో కూడా దాదాపుగా ఇదేవిధంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలుచేసే అవకాశం ఉన్నది.

ఆర్థికంగా వెనుకబడినవర్గాలను ఆదుకొనేందుకు ఈ రిజ‌ర్వేష‌న్లను తెలంగాణ‌లోనూ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఈ మ‌ధ్యే సిఎం కెసిఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలోని ఈడబ్ల్యూఎస్‌లకు పది శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్‌తో కలుపుకొని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి అని ముఖ్య‌మంత్రి తెలిపారు.

కాగా పట్టణాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలుగా, గ్రామీణాల ప్రాంతాల్లో రూ.1.50 లక్షలుగా ఉన్నవాళ్లు ఈ రిజర్వేషన్లకు అర్హులుగా ప్రభుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.