తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1586కు చేరింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ర్ట వైద్యారోగ్య శాఖ బులిటెన్ వెల్లడించింది. ప్రస్తుతం 3,781 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,835కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. నిన్న 351 మంది డిశ్చార్జి కాగా, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,87,468కి చేరింది. 2,178 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.