తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్ : తెలంగాణ ఇంజినీరింగ్, ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. ఈ నెల 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కమిటీ వెల్లడించింది. జులై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 5, 6వ తేదీల్లో అగ్నికల్చర్, ఫార్మా పరీక్షలు, 7, 8, 9వ తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణ ఉంటుంది. ఎంసెట్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి 100 %, రెండో సంవత్సరం నుంచి 70% సిలబస్ ఇవ్వాలని ఇప్పటికే కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా జెఎన్టియు హెచ్ రెక్టార్ గోవర్ధన్ పరీక్ష కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.