తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ క్రిస్‌మస్ శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.