తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకులు..

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లను ప్రారంభిస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ మాట నిల‌బెట్టుకున్నారు. క‌రోనా బారిన ప‌డి స‌మ‌యానికి ఆక్సిజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం చెప్పిన‌ట్టుగానే `చిరు ఆక్సిజ‌న్ బ్యాకుల‌ను ఆయ‌న అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.

“ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో #ChiranjeeviOxygenBanks సేవలు వినియోగించుకోవచ్చు.రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదు.“ అని ట్విట్ట‌ర్‌లో పోస్టు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.