`త‌లైవి` రొమాంటిక్ లుక్ విడుద‌ల‌

దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, సినీ న‌టి జ‌య‌ల‌లిత జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న `త‌లైవి. బాలీవుడ్ న‌టి కంగ‌నారనౌత్ లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న చిత్రంలో ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద్ స్వామి న‌టిస్తున్నాడు. ఇవాళ ఎంజీఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని త‌లైవి మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఎంజీఆర్-జ‌య‌ల‌లిత మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాన్ని లేటెస్ట్ లుక్ లో చూపించారు. ఈ చిత్రాన్ని ఏఎల్ విజ‌య్ డైరెక్ట్ చేస్తున్నాడు. విబ్రి మీడియా-క‌ర్మ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్స్ పై విష్ణు వ‌ర్థ‌న్ ఇందూరి, శైలేశ్ ఆర్ సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు జీవీ ప్ర‌కాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో..ఎంజీఆర్ వీరాభిమానులు త‌మిళ‌నాట సంబురాలు చేసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.