దీపావళి సెలబ్రేషన్స్‌లో రాజశేఖర్ ఫ్యామిలీ

కరోనాని జయించిన రాజశేఖర్ ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్‌ని ఘనంగా జరుపుకుంది. సతీమణి, ఇద్దరు కూతుళ్ళతో కలిసి రాజశేఖర్ ఫొటో దిగగా, ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాగా, రాజశేఖర్ కూతుళ్ళిద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో కథానాయికలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
హీరో రాజశేఖర్‌తో పాటు ఆయన సతీమణి జీవిత, కూతుళ్ళు శివాణి, శివాత్మికలు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. శివాణి, శివాత్మికలు త్వరగానే కరోనా నుండి కోలుకున్నా, రాజశేఖర్, జీవితలు చాలా రోజులు ఆసుపత్రిలో ఉన్నారు రాజశేఖర్ పరిస్థితి అయితే విషమంగా కూడా మారింది. కాని అందరి ప్రార్ధనలు, మంచి వైద్యం వలన ఇటీవల కోలుకొని ఇంటికి వెళ్లారు.