దుబ్బాకలో బిజెపి జ‌య‌కేత‌నం

దుబ్బాక‌: దుబ్బాక‌ ఉప ఎన్నిక‌లో బిజెపి జ‌య‌కేత‌నం ఎగుర వేసింది. న‌రాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు జయకేతనం ఎగురవేశారు. దీంతో కాషాయ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వస్తోంది.  అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి కూడా వచ్చింది.  కానీ, 20 వ రౌండ్ నుంచి ఫలితం మారిపోయింది.  20, 21, 22, 23 మిగతా రౌండ్ లలో బీజేపీ లీడింగ్ సాధించడంతో  విజయం సాధించింది.  ముందుగా చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది.  దుబ్బాకలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.  దుబ్బాకలో బీజేపీ 1470 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది.

 

కౌంటింగ్ వివ‌రాలు రౌండ్ల వారీగా…

23వ రౌండ్‌:

23వ రౌండ్ లో కూడా బిజెపి ఆధిక్యంలో నిలిచింది. ఈ రౌండ్‌లో ర‌ఘునంద‌న్‌రావు 412 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తంగా 1470 ఓట్ల మెజారిటీతో ఆయ‌న విజ‌యం సాధించారు.

22వ రౌండ్‌:

22వ రౌండ్‌లో బిజెపి 438 ఓట్ల  ఆధిక్యం.

టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య హోరాహోరాగా సాగుతున్న పోరులో కమలమే పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. కాగా 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇంకా ఒక్క రౌండ్‌ ఫలితం మాత్రమే మిగిలి ఉంది. 23వ రౌండ్‌లోనూ కాషాయ పార్టీ జోరు ఇలాగే కొనసాగితే రఘునందన్‌ రావు విజయం లాంఛనమే కానుంది.

21వ రౌండ్‌:

21వ రౌండ్‌లో బిజెపికి 380 ఓట్లు ఎక్కువ‌గా వ‌చ్చాయి.  మరో రెండు రౌండ్ల కౌంటింగ్‌ మాత్రమే మిగిలి ఉన్న వేళ బీజేపీ మొత్తంగా 621 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇర‌వ‌య్యో రౌండ్‌:

20వ రౌండ్‌లో బిజెపికి 491 ఓట్ల ఆధిక్యం ల‌భించింది

పంతొమ్మిదో రౌండ్‌:

19వ రౌండ్ లోనూ టిఆర్ ఎస్‌కు 425 ఓట్ల ఆధిక్యం ల‌భించింది.

ప‌ద్దెనిమ‌దో  రౌండ్‌:

18వ రౌండ్ లోనూ టిఆర్ ఎస్‌కు ఆధిక్యం ల‌భించింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ  ఆధిక్యం కొనసాగిస్తోంది. 18వ రౌండ్‌లోనూ 688 ఓట్ల మెజారిటీ సాధించింది. 18 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 174 ఓట్లకు తగ్గింది.

దీంతో పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు టిఆర్ ఎస్ 9 , రౌండ్ల‌లో.. బిజెపి 8 రౌండ‌ల్లో ఆధికంలో నిలిచాయి.

మిగిలి ఉన్న మరో 5 రౌండ్ల ఫలితాలు కీలకం కానున్నాయి. చేగుంట, నార్సింగి మండలాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ప‌దిహేడో రౌండ్‌:

17వ రౌండ్ లోనూ టిఆర్ ఎస్‌కు 872 ఓట్ల ఆధిక్యం ల‌భించింది. ఈ ఉప ఎన్నిక‌లో టిఆర్ ఎస్‌- బిజెపి మ‌ధ్య ఝ‌హోరాహోరీ పోటీ సాగుతోంది.

పుంజుకుంటున్న టిఆర్ ఎస్‌

దుబ్బాక ఉప ఎన్నిక‌లో టిఆర్ ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సూజ‌త పుంజుకుంటున్నారు. 16వ రౌండ్‌లో 749 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
తొలి ఐదు 8,911 రౌండ్ల‌లో బిజెపి ఆధ్యిక్యంలో నిలిచింది. 6,7,10తోపాలు 13 నుంచి 16 రౌండ్ల‌లో టిఆర్ ఎస్ ఆధిక్యంలో ఉంది.

ప‌డిపోతున్న బిజెపి ఆధిపత్యం

16 రౌండ్ల కౌంటింగ్ పూర్త‌య్యేస‌రికి బిజెపి అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు ఆధిక్యం 1,734కి ప‌డిపోయింది. మొత్తం 16 రౌండ్ల‌లో బిజెపికి 8, టిఆర్ ఎస్‌కు 7, ఆధిక్యం ల‌భించింది. ఒక రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

ప‌ద‌హారో రౌండ్‌:

16వ రౌండ్ లోనూ టిఆర్ ఎస్‌కు 749 ఓట్ల ఆధిక్యం

 

ప‌దిహేన‌వ‌ ‌ రౌండ్‌:

15వ రౌండ్ లోనూ టిఆర్ ఎస్‌కు 955 ఓట్ల ఆధిక్యం

వ‌రుస‌గా మూడో రౌండ్‌లోనూ టిఆర్ ఎస్ ఆధిక్యం. 15వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ మెజారిటీ సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 955 ఓట్ల ఆధిక్యం దక్కింది.  ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 3027, బీజేపీ 2072, కాంగ్రెస్‌ పార్టీ 1500 ఓట్లు తెచ్చుకున్నాయి. 15వ రౌండ్‌ ముగిసే సరికి 2483 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం బీజేపీ 41514, టీఆర్‌ఎస్‌ 38,076, కాంగ్రెస్‌ 12658 ఓట్లు సాధించాయి.

13, 14 రౌండ్లలో టీఆర్‌ఎస్‌ జోరు
దుబ్బా​క ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 13, 14 రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించింది. 13వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 304 ఓట్ల ఆధిక్యం దక్కింది. 13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2824, బీజేపీ 2520, కాంగ్రెస్‌ 1212 ఓట్లు దక్కించుకున్నాయి.14వ రౌండ్‌లో 288 ఓట్ల మెజారిటీని టీఆర్‌ఎస్‌ సాధించింది. 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

పద్నాలుగ‌వ‌ రౌండ్‌:

దుబ్బాక కౌంటింగ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.
వ‌రుస‌గా రెండు రౌండ్ల‌లో టిఆర్ ఎస్ ఆధిక్యంలో నిలిచింది.

14వ రౌండ్ లోనూ టిఆర్ ఎస్‌కు 288 ఓట్ల ఆధిక్యం

ప‌ద‌మూడ‌వ రౌండ్‌:

13 వ రౌండ్ లో టిఆర్ ఎస్ కు 304 ఓట్ల ఆధిక్యం

ప‌న్నెండ‌వ‌‌ రౌండ్‌:

ప‌న్నెండ‌వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 83 ఓట్ల ఆధిక్యం.

దుబ్బాక ఎన్నిక ఫ‌లితాల్లో తొలిసారి కాంగ్రెస్ ఆధిక్యం క‌న‌బ‌రిచింది. ఈ రౌండ్‌లో బిజెపికి 1,997 ఓట్లు, టిఆర్ ఎస్ 1,900 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థికి 2,080 ఓట్లు ప‌డ్డాయి. ఇంకా 11 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

ప‌ద‌కొండవ‌ రౌండ్‌:

11వ రౌండ్‌లో మ‌ళ్లీ బిజెపి ఆధిక్య క‌న‌బ‌రిచింది. ఆ పార్టీ అభ్య‌ర్థికి 199 ఓట్ల ఆధిక్యం ల‌భించింది.

11 రౌండ్లు పూర్త‌య్యే స‌రికి బిజెపికి 3,933 ఓట్ల ఆధిక్యంలో ఉంది.  ఇప్ప‌టి వ‌ర‌కు బిజెపికి 34,748, టిఆర్ ఎస్‌కు 30,815, కాంగ్రెస్‌కు 8582 ఓట్లు ల‌భించాయి. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా 12 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

ప‌ద‌వ‌‌ రౌండ్‌:

ప‌ద‌వ రౌండ్‌లో టిఆర్ ఎస్ మ‌ళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. టిఆర్ ఎస్ అభ్య‌‌ర్థికి 456 అభించింది.

ఈ రౌండ్‌లో బీజేపీ 2,492.. టీఆర్‌ఎస్‌ 2,948.. కాంగ్రెస్‌ 899 ఓట్లు సాధించాయి.

ప‌ది రౌండ్లు పూర్త‌య్యేస‌రికి బిజిపిపి 3,734 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బిజెపికి 31,783, టిఆర్ ఎస్ కు 28,049, కాంగ్రెస్‌కు 6,699 ఓట్టు వ‌చ్చాయి.

తొమ్మిదవ‌ రౌండ్‌:

తొమ్మిదో రౌండ్ కౌంటింగ్‌లో బిజిపికి 1,084 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో బిజిపి అభ్య‌ర్థికి 3,413 ఓట్లు రాగా, టిఆర్ ఎస్ అభ్య‌ర్థికి 2,329 ఓట్లు పోల‌య్యాయి.

ఎనిమిద‌వ‌ రౌండ్‌:

8వ రౌండ్‌లో బీజేపీ 621 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 3,106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్‌లో బీజేపీ 3,116 టీఆర్‌ఎస్‌ 2,495.. కాంగ్రెస్‌ 1,122 ఓట్లు సాధించాయి.

ఏడో రౌండ్‌:

ఏడో రౌండ్‌లో టిఆర్ ఎస్ అభ్య‌ర్థికి 2,718 ఓట్లు వ‌చ్చాయి. బిజెపికి 2,536 ఓట్లు ప‌డ్డాయి.

ఆరో రౌండ్‌:
ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 353 ఓట్ల​ ఆధిక్యం సాధించింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,667 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఐదో రౌండ్‌:
ఐదో రౌండ్‌లోనూ బీజేపీ 336 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఐదో రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 3,020 ఓట్ల లీడ్‌లో ఉంది. ఇప్పటివరకు బీజేపీ 16,507.. టీఆర్‌ఎస్‌ 10,497.. కాంగ్రెస్‌ 2,724 ఓట్లు సాధించాయి.

నాలుగో రౌండ్‌:
నాలుగో రౌండ్‌లో బీజేపీ 2,684ఓట్ల ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్‌లో బీజేపీ 3,832.. టీఆర్‌ఎస్‌ 2,407.. కాంగ్రెస్‌ 227 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 13,055, టీఆర్‌ఎస్‌ 10,371 కాంగ్రెస్‌ 2,158 ఓట్లు సాధించాయి. నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ నాలుగో రౌండ్‌లో 1,425 ఓట్లు ఆధిక్యత సాధించారు.

మూడో రౌండ్‌:
మూడో రౌండ్‌లో కౌంటింగ్‌ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్‌ రావు 1,259 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటిదాకా బీజేపీకి 9,224.. టీఆర్‌ఎస్‌కి 7,964.. కాంగ్రెస్‌కి 1,931 ఓట్లు లభించాయి.

రెండో రౌండ్‌:
రెండో రౌండ్‌లో బీజేపీ 279 ఓట్ల ఆధిక్యత సాధించింది. రెండో రౌండ్‌లో బీజేపీకి 1,561 ఓట్లు, టీఆర్ఎస్‌ పార్టీకి 1,282 ఓట్లు లభించాయి. మొదటి రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ మొత్తం 1,135 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 6,492, టీఆర్ఎస్‌కు 5,357 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,315 ఓట్లు లభించాయి.

తొలిరౌండ్‌:
తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు.. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొదటి రౌండ్‌లో బీజేపీ 3,208 ఓట్లు సాధించగా.. టీఆర్‌ఎస్‌ 2,867.. కాంగ్రెస్‌ 648 ఓట్లు సాధించాయి. తొలి రౌండ్‌లోదుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కించారు.

Leave A Reply

Your email address will not be published.