దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24గంటల్లో 11,666 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 14,301 మంది వైరస్ బారినుండి కొలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా వైరస్ బారిన పడి123 మంది మృత్యువాతపడ్డారని బులిటెన్‌లో ర్కొంది. కాగా తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,01,193కు పెరిగింది. ఇప్పటి వరకు 1,03,73,606 మంది కోలుకోగా.. 1,53,847 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 1,73,740 ఉన్నాయని తెలిపింది.