దేశంలో కొత్తగా 16,577 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మ‌ళ్లీ కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 16,577 కొవిడ్-19 కేసులు కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. దేశంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,63,491కి పెరిగింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 12,179 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,07,50,680 మంది కోలుకున్నారు. కొత్త‌గా క‌రోనాతో 120 మంది మ‌ర‌ణించారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,56,825కి పెరిగింది.ప్రస్తుతం దేశంలో 1,55,986 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.