దేశంలో కొత్త‌గా 14,989 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ మేర‌కు బుధ‌వారం ఉద‌యం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా 98 మంది మృత్యువాతపడ్డారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,39,516కు పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 13,123 కోలుకుఉన్నారు. ఇప్పటి వరకు 1,08,12,044 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 1,70,126 క్రియాశీల కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.