దేశంలో టాలీవుడ్‌దే అగ్ర‌స్థానం కంగ‌నా

హైదరాబాద్ : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా రనౌత్ వ‌రుస ట్వీట్ల‌తో ప్ర‌తిరోజు మీడియాలో వ‌స్తున్నారు. కాగా దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని నోయిడాలో నిర్మించాల‌ని ఉత్త‌ర ప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ అధికారుల‌ను శుక్ర‌వారం ఆదేశించిన విష‌యం తెలిసిందే. దీనిపై కంగ‌నా స్పందిస్తూ చిత్ర ప‌రిశ్ర‌మ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ‘”దేశంలో బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ అగ్ర‌స్థానంలో ఉంద‌నుకోవ‌డం పొర‌పాటు. ఇప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది‌.  తెలుగు చిత్ర పరిశ్రమ శాసిస్తోంది. బాలీవుడ్ చిత్రాలు చాలా వరకు షూటింగ్‌లు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాయని’ ఆమె పేర్కొన్నారు. కంగనా రనౌత్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరంగా పాన్ ఇండియన్ ప్రాజెక్టులను రూపొందిస్తోంది. ‘భారతదేశంలో అగ్రశ్రేణి చిత్ర పరిశ్రమ.. హిందీ చిత్ర పరిశ్రమ అని ప్రజల అభిప్రాయం తప్పు.

తెలుగు చిత్ర పరిశ్రమ తనను తాను అగ్రస్థానంలో నిలుపుకుంది. బహు భాష సినిమాలు చేయడంతో పాటు పాన్ ఇండియా సినిమాలు చేయడంలో తెలుగు సినిమా ముందుంది’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ముంబై ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడాలోని అతిపెద్ద ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారన్న వార్తలపై కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే నెపోటిజం, డ్రగ్‌మాఫియా, సెక్సిజం, విదేశీ సినిమా, తదితర ఎనిమిదింటిని ఉగ్రవాదంతో పోలుస్తూ.. వాటి నుంచి పరిశ్రమను కాపాడాలని ట్వీట్‌ చేసింది. కంగనా తెలుగులో ప్రభాస్‌కు జోడిగా ఏక్‌ నిరంజన్‌ చిత్రంలో నటించింది. దిలా వుంటే కంగ‌నా మ‌రోసారి బాలీవుడ్‌ను త‌క్కువ చేసి మాట్లాడినందుకు సెల‌బ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

 

Leave A Reply

Your email address will not be published.