దశల వారీగా రైళ్లు పునరుద్ధరణ…

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మూలంగా నిలిచి పోయిన రైలు సర్వీసులు ఇప్పటికే
% వరకు పునరుద్దరించారు. కాగా మిగతా రైలు సర్వీసులు కూడా దశల వారీగా పునరుద్ధరిస్తామని, అన్ని రైళ్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి తేదీని నిర్ణయించలేదని భారతీయ రైల్వేస్ డిపార్ట్‌మెంటు ప్రకటించింది. క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నామని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 65% రైళ్లు పునఃప్రారంభమయ్యాయని ప్రకటించింది. జనవరిలోనే దాదాపు 250కి పైగా రైళ్లు పునఃప్రారంభమయ్యాయని పేర్కొంది.