29న `ధరణి` ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సర్కార్ రెవెన్యూ సంస్కరణ ల్లో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టటిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ‘ధరణి’ పోర్టల్ ప్రారంభ తేదీ ఖరారు అయింది. ఈ నెల 29న ముఖ్యమంత్రి దీనిని ప్రారంభించనున్నారు. ముందుగా దసరాకి ధరణి అనుకున్నప్పటికి అది వాయిదా పడి 29న ప్రజల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ‘ధరణి’ పోర్టల్.. భూమి రిజిస్ట్రేషన్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నది. రాష్ట్రంలోని 570 మండలాల్లో తాసిల్దార్లు ఒక్కో మండలంలో 10 దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎలాంటి సాంకేతిక, మరే ఇతర సమస్యలు లేకుండా భూమి రిజిస్ట్రేషన్ ట్రయల్స్ నిర్వహించిన ప్రతి చోటా విజయవంతమైందని సిఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు.