నాగ‌బాబుకి క‌రోనా పాజిటివ్‌

మెగా బ్ర‌ద‌ర్‌, టాలీవుడ్ న‌టుడు నాగ‌బాబుకి కోవిడ్ పాజిటివ్ క‌న్‌ఫ‌మ్ అయింది. ఇటీవ‌ల ఆయ‌న కోవిడ్ టెస్టు చేయించుకోగా నిర్ధార‌ణ అయింది. దీనిని ఆయ‌న ఇన్‌స్టా వేదిక‌గా పోస్ట్ పెట్టారు. “ఒక వ్యాధి వ‌చ్చింద‌ని బాధ‌గా ఉండ‌డం కాదు. దాని నుంచి కోల‌కుని వేరొక‌రికి సాయం చేయాలి.. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించి.. కోరానాను జ‌యించి ఫ్లాస్మా దాత‌గా మార‌తాను“ అని నాగాబాబు పోస్టు చేశారు. ఈ పోస్టు చూసిన అభిమానులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు. న‌టుడు క‌ల్యాణ్ దేవ్ కూడా `మామ‌య్య మీరు త్వ‌రగా కోలుకోవాల‌ని దేవుణ్ణి వేడుకుంటున్నా“ అని పోస్టు చేశారు. దీనిపై నాగ‌బాబు స్పందిస్తూ `ధ‌న్య‌వాదాలు.. నేను ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటుంన్నందుకు“ అని రిప్లై ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.