నాయిని అహ‌ల్య మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైద‌రాబాద్‌: మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి నాయిని అహల్య(68) మృతి ప‌ట్ల తెలంగాణ ముఖ్మంత్రి కెసిఆర్‌ సంతాపం ప్ర‌క‌టించారు. అహ‌ల్య కుటుంబ‌స‌భ్యుల‌కు సీఎం కేసీఆర్ త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. సీఎంతోపాటు హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, అజ‌య్ కుమార్, శ్రీనివాస్ గౌడ్‌, ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు, సబితా ఇంద్రారెడ్డి త‌దిత‌రులు తమ సంతాపం ప్ర‌క‌టించారు.

త‌ప్ప‌క చ‌ద‌వండి:నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత

టీఆర్‌ఎస్‌ దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య కన్నుమూశారు. నాయిని మృతి నుంచి తేరుకొకముందే ఆ కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు. ఆమె కరోనా నుంచి కోలుకున్నా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.