నాలుగేళ్ల చిన్నారి .. 90 గంట‌లు మృత్యువుతో పోరాటం

ఇజ్మీర్ (ట‌ర్కీ): భూకంప బీభ‌త్సానికి అత‌లాకుత‌ల‌మైన ట‌ర్కీలో నాలుగేళ్ల చిన్నారి నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. ఆ నాలుగేళ్ల చిన్నారి ఐడా గెజ్గిన్‌కు ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయి! అందుకే ఆ పాప దగ్గరకు రావడానికి మృత్యువు కూడా భయపడింది.. ఇటీవల టర్కీలో పెను భూకంపం సంభవించింది కదా! ఆ భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవంతులు కూడా నేలకూలాయి.. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.. తీవ్ర ప్రాంత నగరం ఇజ్మీర్‌లోనూ భూకంపం బీభత్సాన్ని సృష్టించింది. నిమిషాలలో అదో శిథిలనగరంగా మారింది.. ఆ ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి..

రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలిగిస్తూనే ఉన్నారు.. ఆ శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న ఓ నాలుగేళ్ల చిన్నారి ఐడా గెజ్గిన్‌ను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.. వెంటనే శిథిలాలను తొలగించి 90 గంట‌ల త‌ర్వాత ఆ పాపను బయటకు తీశారు.. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు.. ఇప్పుడా పాప ఆరోగ్యం నిలకడగా ఉంది.. ఐడా గెజ్గిన్‌ ప్రాణాలు కాపాడినందుకు రెస్క్యూ సిబ్బంది ఆనందపడుతున్నారు.. సంతోషంతో చప్పట్లు కొట్టారు.. 90 గంటల పాటు ఆ పాప తీవ్ర గాయాలతో సజీవంగా ఉండటం అద్భుతమేనంటున్నారు ఇజ్మీర్‌ మేయర్‌ టన్‌ సోయర్‌.

Leave A Reply

Your email address will not be published.