నాలుగేళ్ళ బాలికపై మోడీ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ : ‘వందే మాతరం’ గేయాన్ని ఆల‌పించిన నాలుగేళ్ళ బాలికను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంస‌ల‌తో ముంచెత్తారు. మిజోరాం ముఖ్యమంత్రి జొరాంతంగ ట్వీట్ చేసిన ఈ బాలిక వీడియోను మోడీ రీట్వీట్ చేశారు. మిజోరాంలోని లుంగ్లేయికి చెందిన నాలుగేళ్ళ బాలిక ఎస్తేర్ హ్నమ్టే ‘వందే మాతరం’ గేయాన్ని ఆలపించింది. ఆమె ఆలపించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె జాతీయ పతాకాన్ని పట్టుకుని ‘వందే మాతరం’ గేయాన్ని ఆలపించిన‌ వీడియోను ముఖ్యమంత్రి జొరాంతంగ ట్వీట్ చేశారు. ఈ వీడియోను మోడీ శనివారం రీట్వీట్ చేశారు. ఎస్తేర్ హ్నమ్టే ప్రదర్శన అద్భుతం, భళి భళి, అభిమానించదగినది అంటూ ప్రశంసించారు. ఎస్తేర్ తనకు గర్వకారణమని పేర్కొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.