నిండు కుండ‌లా హుస్సేన్ సాగ‌ర్‌

నిండు కుండ‌లా హుస్సేన్ సాగ‌ర్‌


హైద‌రాబాద్: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో కురుస్తున్న ఎడ‌తెరిపిలేని భారీ వ‌ర్షాల‌కు హుస్సేన్‌సాగ‌ర్ నిండుకుండ‌లా మారింది. న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు భారీ వ‌ర్షాలు కుర‌వ‌డం, జ‌లాశ‌యానికి ఎగువ‌భాగంలో వాన‌ల మూలంగా వ‌చ్చే వ‌ర‌ద‌ల‌తో హుస్సేన్ సాగ‌ర్ పూర్తి జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది. దీని పూర్తిస్థాయి నీటి నిలువ సా‌మార్థ్యం 513.41 మీట‌ర్లు.

వ‌ర‌ద ప్ర‌వాహాం ఎక్కువ‌గా ఉండ‌డంతో అధికారులు చివ‌రి గేట్ల‌ను సైతం ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. జీహెచ్ఎంసీ లేక్స్ వింగ్ ప‌రిస్థితిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుంది. కొత్త ద‌శాబ్దాల క్రితం హుస్సేన్ సాగ‌ర్‌కు 21 గేట్ల‌ను అమ‌ర్చారు. నీటిని దిగువ‌కు విడుద‌ల చేసే ముందే జీహెచ్ఎంసీ అధికారులు లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. దోమ‌ల‌గూడ‌, హిమ‌య‌త్‌సాగ‌ర్‌, లిబ‌ర్టీ, అశోక్ న‌గ‌ర్ ప్రాంతాల‌కు అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.