నిహారిక‌తో చిరు సెల్ఫీ.. నాగబాబు ఎమోష‌న‌ల్ పోస్ట్

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల త‌న‌య నిహారిక మ‌రికొద్ది రోజుల‌లో జొన్న‌ల‌గ‌డ్డ ఫ్యామిలీలోకి అడుగుపెట్ట‌నున్న విష‌యం తెలిసింఏ. డిసెంబ‌ర్ 9న ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా చైత‌న్య‌-నిహారిక‌ల పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుండ‌గా, ఈ శుభ‌కార్యానికి మెగా ఫ్యామిలీ అంతా హాజ‌రు కానున్నారు. ఇక ఆదివారం నిహారికని పెళ్ళికూతురుని చేసే కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా దీనికి మెగాస్టార్ చిరంజీవి త‌న స‌తీమ‌ణి సురేఖ‌తో హాజ‌ర‌య్యారు.

త‌న కూతురికి ఆశీర్వాదం అందించి ఆ త‌ర్వాత సెల్ఫీ కూడా దిగారు చిరు. ఈ ఫొటోలో నిహారిక, చిరంజీవి మెరిసిపోతున్నారు. ఇదే ఫొటోని నాగ‌బాబు త‌న సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ అయ్యారు. చిరు ప్రేమ‌కు స‌రిహ‌ద్దులు ఉండ‌వు, అత‌ని చిరున‌వ్వు ప్ర‌తి సంఘ‌ట‌న‌ను ఒక‌వేడుక‌లా మారుస్తుంది అనేకామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇది మెగా ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

 

Leave A Reply

Your email address will not be published.