నీ ద‌గ్గ‌ర చాయ్ బాగుంట‌ద‌ట‌.. ఓ చాయ్ పోయ్ తాగుతా..

దుబ్బాక బ‌స్టాండ్ స‌ర్కిల్‌లో చాయ్‌తాగిన మంత్రి హరీశ్‌ రావు

దుబ్బాక : మంత్రి హరీశ్‌ రావు అంటే ప్ర‌జ‌ల మ‌నిషి అని మారోసారి నిరూపించాడు. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆర్ధిక మంత్రిగా ఉన్నా ప్ర‌జ‌ల‌తో వారి మ‌నిషిలా క‌లిసిపోవ‌డం ఆయ‌నలోని ప్ర‌త్యేక‌త‌. ఆయ‌న ఎంత పెద్ద హోదాలో ఉన్నా నేను మీవాడినే అని మ‌రోసారి గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. తాజాగా దుబ్బాకలో మరో సారి తన నిరాడంబతరను మంత్రి చాటుకున్నారు.

ఒక సామాన్యుడిగా దుబ్బాక బస్టాండ్ సర్కిల్‌లో చాయ్ తాగి ముచ్చటించారు. ‘దుబ్బాకలో ఈ చాయ్ డబ్బా ఫేమస్ ఆట కదా.. నీ దగ్గర చాయ్ బాగుంట‌ద‌ట‌గా.. ఓ చాయ్‌ పొయ్‌ తాగుతా..“ అని టీ తాగుతూ.. చాయ్ దుకాణం వ్య‌క్తితో ఆత్మీయంగా మాట్లాడారు… త‌ర్వాత ఆ టి కొట్టు చుట్టుప‌క్క‌ల ఉన్న యువతతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. దాంతో హ‌రీష్‌రావు ప్ర‌జ‌ల మ‌నిషి అని అక్క‌డ అంద‌రూ అనుకుంటున్నారు. ఏ హోదాలో ఉన్నా నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారిలో ఒకడిగా కలిసిపోతూ సమస్యలను పరిష్కరించడం హ‌రీష్‌రావు నైజం. అంత‌పెద్ద నాయ‌కుడు బస్టాండ్ స‌ర్కిల్‌లో చాయ్‌తాగుతూ అంద‌రిని ప‌లక‌రించ‌డంతో అక్క‌డి వారంతా హ‌రీష్ రావు గొప్ప‌మ‌న‌సుకు ఫిదా అయిపోయారు.

Leave A Reply

Your email address will not be published.