నేడు `ధరణి`పై ముఖ్య‌మంత్రి కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్‌: ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల (సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ) కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై అధికారులతో చర్చించనున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుంటారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.