నేడు నేవీలోకి ఐఎన్‌ఎస్‌ కవరట్టి

విశాఖ‌ప‌ట్ట‌ణం: భార‌త నావికాద‌ళంలోకి మ‌రింత బ‌లోపేతం కానుంది. ఈ రోజు యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ (ఎఎస్‌డబ్ల్యు) నౌక ఐఎన్‌ఎస్‌ కవరట్టిని స‌ముద్ర ప్ర‌వేశం చేయ‌నుంది. దీనిని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం.నవరణే నేడు(గురువారం) భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టనున్నారు. విశాఖలోని నావల్‌ డాక్‌యార్డ్‌ నుండి ఈ నౌక స‌ముద్ర ప్రవేశం చేయ‌నుంది. కాగా, ఈ యుద్ధనౌకతో నేవీ సామర్థ్యం మరింత పెరిగిందని భారత నావికా దళం ఒక ప్రకటనలో పేర్కొంది. 2003లో అమోదించబడిన ‘ప్రాజెక్ట్‌ 28’ కింద దేశీయంగా నిర్మించిన నాలుగు ఎఎస్‌డబ్ల్యులలో ఇది చివరిది. ఇది ప్రస్తుతం నేవీలో ఉన్న ఎఎస్‌డబ్ల్యు తరగతికి చెందినదని నేవీ తెలిపింది. ఈప్రాజెక్ట్‌ కింద నిర్మించిన మూడు యుద్ధనౌకలు వరుసగా ఐఎన్‌ఎస్‌ కమోర్టా (2014), ఐఎన్‌ఎస్‌ కడ్మట్‌ (2016), ఐఎన్‌ఎస్‌ కిల్లాన్‌ (2017)లు ఇప్పటికే నేవీలో సేవలందిస్తున్నాయి. పూర్తి కార్బన్‌ మిశ్రమాలతో నిర్మించిన ఈ నౌకతో భారతీయ నౌకా నిర్మాణం ప్రశంసనీయమైన ఘనతను పొందినట్లు నేవీ పేర్కొంది. ఐఎన్ఎస్ కవరట్టి అనే పేరు ఐఆర్ఎస్ కవరట్టి అనే పేరు నుండి వచ్చింది, ఇది ఆర్నాలా క్లాస్ క్షిపణి కొర్వెట్టి. పాత ఐఎన్ఎస్ కవరట్టి 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పనిచేసింది.

1 Comment
  1. […] నేడు నేవీలోకి ఐఎన్‌ఎస్‌ కవరట్టి […]

Leave A Reply

Your email address will not be published.