నేపాల్‌లోవిరిగిపడ్డ కొండచరియలు
ముగ్గురి మృతి.. 25 మంది గల్లంతు

కఠ్మాండు: నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొడచరియలు విరిగిపడ్డాయి. ఇది నేపాల్‌లోని సింధూపాల్‌చౌక్ జిల్లాలో గతరాత్రి కొండ చరియలు విరిగిపడిన పడ్డాయి. ఈ ఘటన బర్హాబిసి గ్రామీణ మున్సిపాలిటీ-7లోని భిర్ఖార్కా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా గల్లంతయ్యారు. కాగా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, 9 ఇళ్లు మట్టి కింద కూరుకుపోయాయని మున్సిపాలిటీ చైర్మన్ నిబ్ ఫిన్‌జో షెర్ఫా తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్ ఆర్మీ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారని వెల్లడించారు. భారీ ఎత్తున సహాయ కార్యక్రమలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం బారీగా గాలింపు చర్యలు చెపట్టారు.