మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు

 క‌ంగ‌నా వ్య‌వ‌హారంపై స‌రైన స్పందిస్తా‌ సీఎం ఉద్ధవ్

ముంబ‌యి: గ‌త కొన్ని రోజులుగా మ‌హారాష్ట్రప్ర‌భుత్వానికి బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌కు జ‌రుగుతున్న రచ్చ తెలిసిందే. కంగ‌నా మ‌హాప్ర‌భుత్వంపై ట్విట్ల వ‌ర్షం కురిపిస్తోంది.. ఒక సంద‌ర్భంలో ఆమె ముంబ‌యిని పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌తో పోల్చి ప‌లువురి ఆగ్ర‌హానికి గురైంది. ఈ నేప‌థ్యంలో మ‌హా స‌ర్కార్‌లో కంగ‌నా ఆఫీసును కూల్చివేయ‌డం, ఆమె కోర్టుకు ఎక్క‌డం తెలిసిందే.. కాగా ఇంత గొడ‌వ జ‌రుగుతున్న మ‌హా సిఎం గానీ ఇత‌రులు గానీ ఎవ‌రు ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు.
తాగా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం పెద‌వి విప్పారు. తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ‘‘నా మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉంది. మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర చేస్తున్నారు. సరైన సమయంలో దీనిపై స్పందిస్తా.’’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. కొందరు కరోనా అయిపోయిందని భావించి, రాజకీయాలను ప్రారంభించేశారని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. మహారాష్ట్రను బద్నాం చేయడానికి కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ప్రస్తుతం తానేమీ మాట్లాడనని అన్నారు. ఈ విషయాలపై సరైన సమయంలో స్పందిస్తానని, ‘సీఎం ప్రోటోకాల్’ ను పక్కనెట్టి మరీ మాట్లాడతానని ఆయన తీవ్ర స్వరంతో పేర్కొన్నారు.   (కంగ‌నపై ప్ర‌కాశ్‌రాజ్ సెటైర్‌..)
కరోనా నేపథ్యంలో ఈనెల 15 నుంచి `నా కుటుంబం – నా బాధ్యత’ అన్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైద్యాధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారని ఆయన తెలిపారు. డిసెంబర్, జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని, దానికి అందరూ సహకరించాలని ఉద్ధవ్ విజ్ఞప్తి చేశారు. చూడాలి ఉద్ద‌వ్ ప్ర‌క‌ట‌న‌తో అయినా ఈ వ్య‌వ‌హారం ఇంత‌టితో స‌ద్దుమ‌ణుగుతుందో లేదో చూడాలి మ‌రి. ( ‘మహా’ ప్రభుత్వంపై కంగనా ట్వీట్‌)

Leave A Reply

Your email address will not be published.