టి. వేదాంత సూరి : న్యూజిలాండ్‌లో.. పిల్ల‌ల విద్యా, ఆరోగ్య బాధ్య‌త స‌ర్కార్‌దే

ఆక్లాండ్: న్యూజిలాండ్లో వృద్ధులకె కాదు పిల్లలకూ ఎన్నో సౌకర్యాలు.. ఇక్కడ పాఠశాలలు మానసిక, శారీరక, వ్యక్తిత్వ వికాస కేంద్రాలు.. ఐదేళ్ల నుంచి పాఠశాల విద్య ప్రారంభ మవుతుంది.. అంతవరకు చైల్డ్ కేర్ సెంటర్ లో ఉంచుతారు.. పిల్లలు తల్లి గర్భంలో వున్నప్పటి నుంచి.. ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. పాప పుట్టగానే.. నిరంతరం పిల్లల ఎదుగుదల విషయం లో తల్లి దండ్రలకు సలహాలు ఇస్తుంటారు. వారి ఆరోగ్యం, విద్య అంటా ఉచితమే.. ప్రతి కౌంటీ లో పిల్లలకు ఆటల మైదానాలు ఉంటాయి. పాఠశాలల్లో చదువు పై ఒత్తిడి ఉండదు.. పిల్లల అభిరుచుల మేరకు సబ్జెక్టులు ఉంటాయి. ఆటలు,సంగీతం, నృత్యం, కార్పెంటరీ, కుకింగ్ వంటి సబ్జెక్టు లు ఉంటాయి. పుస్తకాల మోత ఉండదు కావలసిన పుస్తకాలు పాఠశాల లోనే ఉంటాయి. మార్కుల కోసం ఒత్తిడి ఉండదు. డాక్టర్, కావాలని, ఇంజనీర్ కావాలని లేదా ఇంకా ఏదేదో చేసి డబ్బు సంపాదించాలని తల్లి దండ్రలు అనుకోరు. తమ కాళ్ళ పై తాము నిలబడి, తమ బతుకు తాము బతికితే చాలు అనుకుంటారు. ఎప్పుడైతే పిల్లలను ఒక వ్యాపార వస్తువుగా ఆలోచిస్తారో అప్పుడు పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది.. పిల్లలు 18 ఏళ్ళు నిండగానే, తల్లిదండ్రుల వద్ద ఉండటానికి ఇష్టపడరు.. 13 14 వ ఏట నుంచే సంపాదన మొదలు పెడతారు.. పిల్లలకు కావలసిన ఈత కొలనులు, ఆటల మైదానాలు , గార్డెన్లు చాలా ఉంటాయి.. వారికి రక్షణ విషయం లో కట్టుదిట్టమైన చట్టాలు వున్నాయి.. అవి పెద్దవారు ఎవరు ఉల్లంఘించినా కఠిన శిక్ష తప్పదు..

Leave A Reply

Your email address will not be published.