న్యూజిలాండ్‌లో భూకంపం..
వెల్లింగ్టన్: కెర్మాడెక్ దీవుల్లో శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై 8.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. అంతకు ముందు 7.3, 7.4 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
గంట వ్యవధిలో మూడుసార్లు భూకంపాలు రావడంతో జనం వణికిపోయారు. కెర్మాడెక్ దీవులు న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి ఈశాన్యంగా 500 నుంచి 620 మైళ్లదూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
“ప్రజలు బీచ్ ప్రాంతాలను విడిచిపెట్టి, అన్ని నీటి కార్యకలాపాలను ఆపాలి, మరియు ట్రాఫిక్ జామ్లను సృష్టించకుండా ఉండటానికి వారి పిల్లలను పాఠశాలల్లోకి తీసుకెళ్లకూడదు” అని అత్యవసర సేవల ప్రతినిధి అలెగ్జాండర్ రోసిగ్నోల్ పబ్లిక్ రేడియోలో చెప్పారు. అన్నారు.