న్యూజిలాండ్‌లో మ‌ళ్లీ క‌రోనా..

గ‌తవారం అక్లాండ్‌లో మొద‌లైన ఒక కేసు వారంప‌దిరోజులో్ల 49 కేసులు న‌మోదు ఎన్నిక‌లు వాయిదా: న్యూజిలాండ్ ప్ర‌ధాని

న్యూజిలాండ్‌లో మ‌ళ్లీ క‌రోనా..

గ‌తవారం అక్లాండ్‌లో మొద‌లైన ఒక కేసు

వారంప‌దిరోజులో్ల 49 కేసులు న‌మోదు

ఎన్నిక‌లు వాయిదా: న్యూజిలాండ్ ప్ర‌ధాని

 

వెల్లింగ్టన్‌: ప‌్ర‌పంచాన్నంతా క‌రోనా భ‌యభ్రాంతుల‌కు గురిచేస్తుంటే.. న్యూజిలాండ్ దేశం మాత్రం ఈ మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థంగా ఎదుర్కొంది. కోవిడ్ వైర‌స్ ప్ర‌ప‌పంచ‌ దేశాల‌న్నిటిని ముప్పుతిప్ప‌లు పెడుతుంటే న్యూజిలాండ్‌ను మాత్రం ఏమీ చేయ‌లేక‌పోయింద‌ని మేధావులంతా కొనియాడారు. అన్ని దేశాలు న్యూజిలాండ్‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పిలుపును కూడా ఇచ్చాయి. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (డ‌బ్లుహెచ్ఓ) కూడా కొనియాడింది….. కానీ ఈ గెలుపు మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలింది. దాదాపు 100 రోజుల త‌ర్వాత గ‌త‌వారం అక్లాండ్ న‌గ‌రంలో ఒక కేసు న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో దేశంలో కరోనా కేసులు మళ్లీ నమోదవుతుండటంతో నాలుగు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్్న‌స్‌ తెలిపారు. సెప్టెంబరు 19 నుంచి జరగాల్సిన ఎన్నికలను అక్టోబరు 17కి వాయిదా వేస్తున్నట్టు ఆమె సోమవారం ప్రకటించారు. 102 రోజుల తరువాత గత వారం దేశంలోని అతి పెద్ద నగరమైన ఆక్లాండ్‌లో ఓ కరోనా కేసు నమోదైంది. న్యూజిలాండ్‌లో గత వారం నుంచి ఇప్పటివరకూ 49 కేసులు నమోదయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా అన్ని పార్టీలు ప్రచారాన్ని నిలిపివేశాయి. ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ నిర్ణయం తీసుకున్నారు. మరోసారి వాయిదా వేసే అవకాశం లేదని ఆమె తెలిపారు. కాగా గ‌త కొంత కాలంగా న్యూజిలాండ్ వ్యాప్తంగా కేసులు లేక‌పోవ‌డంతో క‌రోనాని ఎదుర్కొన్న ఏకైక దేశంగా నిలిచింది. కానీ ఆ ఆశ‌లు కూడా గ‌ల్లంతైన‌ట్లే అని ప‌లువురు అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.