నడ్డా టీమ్‌లో అరుణ, పురందేశ్వరి

న్యూఢిల్లీ:భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా 13 మంది , 13 మంది జాతీయ కార్యదర్శులు, 23 మంది జాతీయ అధికార ప్రతినిధులు, ఎనిమిది మందికి ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తెలంగాణ నాయకురాలు డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టిన అధిష్టానం, ఆంధ్రప్రదేశ్ నేత పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. కాగా రామ్ మాధవ్, మురళీధర్ రావు, అనిల్ జైన్‌లకు ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుంచి తప్పించారు. పంజాబ్‌కు చెందిన తరుణ్ చుగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకువచ్చారు. మాజీ కేంద్రం మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజను పార్టీ సెక్రటరీగా నియమించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు.
బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షులు
యువ మోర్చా అధ్యక్షుడు- ఎంపీ తేజస్వి సూర్య
జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు- డాక్టర్ లక్ష్మణ్
కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు- ఎంపీ రాజ్ కుమార్ చాహర్
ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- లాల్ సింగ్ ఆర్య
ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- సమీర్ ఒరాన్
మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- జమాల్ సిద్ధికి
జాతీయ ఉపాధ్యక్షులు వీరే..: డాక్టర్ రమణ్ సింగ్, ఎమ్మెల్యే (ఛత్తీస్‌గఢ్), శ్రీమతి వసుంధరా రాజే సింధియా, ఎమ్మెల్యే (రాజస్థాన్), రాధా మోహన్ సింగ్, ఎంపీ (బీహార్), బైజంయత్ జే పాండే (ఒడిశా), రుఘబర్ దాస్ (జార్ఖాండ్), ముకుల్ రాయ్ (పశ్చిమ బెంగాల్), రేఖావర్మ, ఎంపీ (ఉత్తరప్రదేశ్), అన్నపూర్ణా దేవి, ఎంపీ (జార్ఖాండ్), డాక్టర్ భఆరత్ బెన్ షియాల్, ఎంపీ (గుజరాత్), డీకే అరుణ (తెలంగాణ), ఎం.చుబావో (నాగాలాండ్), అబ్దుల్లా కుట్టి (కేరళ).
జాతీయ ప్రధాన కార్యదర్శులు: భూపిందర్ యాదవ్, ఎంపీ (రాజస్థాన్), అరుణ్ సింగ్, ఎంపీ (ఉత్తరప్రదేశ్), కైలాష్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్), దుష్యంత్ కుమార్ గౌతమ్, ఎంపీ (ఢిల్లీ), డి.పురందరేశ్వరి (ఆంధ్రప్రదేశ్), సీటీ రవి, ఎమ్మెల్యే (కర్ణాటక), తరుణ్ చుక్ (పంజాబ్), దిలీప్ సైకియా, ఎంపీ (అసోం).
జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్): బీఎల్.సంతోష్ (ఢిల్లీ)
జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు: వి.సతీష్ (ముంబై), సౌదాన్ సింగ్ (రాజ్‌పూర్), శివప్రకాష్ (లక్నో)
జాతీయ కార్యదర్శులు: శ్రీ వినోద్ తావడే (మహారాష్ట్ర)