నవనీత్ కౌర్ ఆరోగ్యం విషమం?
నవనీత్ కౌర్ ఆరోగ్యం విషమం?

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్, మహారాష్ట్రలోని అమరావతి ఎంపి అయిన నవనీత్ కౌర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కౌర్ కుటుంబంలో 12 మంది మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ఆమె భర్త, పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఫ్యామిలీకి సేవలు చేసే క్రమంలో నవనీత్‌కు కూడా కరోనా సోకింది. దీంతో వెంటనే ఆమె చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్లో చేరారు. మహారాష్ట్ర పత్రికల (ముంబయి మిర్రర్) కథనం ప్రకారం.. నవనీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈమెను ముంబై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. నవనీత్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్ధిస్తున్నారు. టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్గా తెలుగువారికి సుపరిచితురాలు. ఆమె నటించిన ‘యమ దొంగ’ సినిమాలో ‘యంగ్ యమ యంగ్ యమ’ అనే ప్రత్యేక పాట అత్యంత ప్రేక్షకాదరణ పొందింది.