సూపర్‌హిట్ మూవీ ‘నరసింహ’కు సీక్వెల్..
Movie News: సూపర్‌స్టార్ రజనీకాంత్ సూపర్‌హిట్ సినిమా ‘నరసింహ’. 1999లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో నీలాంబరిగా రమ్మకృష్ణ పాత్ర ఎంత పవర్‌పుల్లో తెలిసిన విషయమే. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన రజనీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా నరసింహ చిత్రం రీరిలీజ్ చేయనున్నారు. దీని ప్రచారంలో భాగంగా రజనీకాంత్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
‘ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టి థియోటర్లలోకి వచ్చిన సినిమా నరసింహ’ అని.. అలాంటి చిత్రానికి సీక్వెల్ తీయనున్నామన్నారు. ఎన్నో సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయని, అలాంటప్పుడు ఈ సూపర్ హిట్ మూవీకి కూడా సీక్వెల్ ఎందుకు రాకూడదని అన్నారు. అయితే, ఈ ఆలోచన రోబో 2.0, జైలర్ 2 చేసేటపుడే వచ్చిందన్నారు. నరసింహ సీక్వెల్ ని ‘నీలాంబరి’ అనే టైటిల్‌తో అందిస్తామని ఆయన తెలిపారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
‘నరసింహ’ చిత్రంలో నీలాంబరి పాత్రకు మొదటగా ఐశ్వర్యారాయ్‌ను అనుకున్నారంట.. అయితే ఆమెకు ఆసక్తి లేదని తెలపగా తర్వాత శ్రీదేవి, మాధురీదీక్షిత్ పేర్లను కూడా పరిశీలించారట. చివరిగా రమ్యకృష్ణ పేరును డైరెక్టర్ చెప్పగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
Entertainment News: కవ్వించే అందాలతో.. Priyanka Chopara
[…] Also Read: ఇసిఐఎల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్ట… […]