పవన్ తో సినిమా.. రానా ఏమన్నారంటే..

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓ కొత్త సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బిజు మీనన్ నటించిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక పృథ్వీరాజ్ పాత్రకు గానూ పలువురి పేర్లు వినిపించాయి. అందులో రానా, నితిన్, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని టాక్ నడిచింది.
ఇదిలా ఉంటే ఈ రీమేక్‌పై రానా స్పందించారు. ఇందులో ఓ పాత్ర కోసం తనను సంప్రదించిన మాట నిజమేనని ఆయన అన్నారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ అవ్వలేదని, ఇందులో నటించాలని తనకు ఆసక్తిగా ఉందని తెలిపారు. మరి ఈ మూవీ కోసం రానా ఫైనల్ అవ్వనున్నారా..? లేదా..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ రీమేక్‌కి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు.
మరోవైపు తన బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నానని రానా అధికారికంగా ప్రకటించారు. `బాబాయ్‌తో కలిసి ఓ సినిమా కోసం పనిచేస్తున్నాను. ఇప్పటికే మా కథను ఫైనల్ చేశాం. వచ్చే ఏడాది మా సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తాం.` అని రానా తెలిపారు.