పాత ఖాతాలోకే రైతుబంధు సాయం
బ్యాంకుల విలీనంతో రైతుబంధుకు ఇబ్బంది లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్ (CLiC2NEWS): రైతుబంధు పంపిణీకి ఈ మధ్యకాలంలో జరిగి పలు బ్యాంకుల విలీనంతో ఎలాంటి ఆటంకం లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. విలీనమైన బ్యాంకులకు సంబంధించి ఖాతాలు ఉన్న రైతులెవరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదని.. పాత బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ల ఆధారంగానే రైతుబంధు నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు. వానకాలం రైతుబంధు పంపిణీపై ఆదివారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన కొత్త లబ్ధిదారులు, పాస్‌బుక్‌లలో అదనంగా భూమి చేరినవారు తమ పాస్‌బుక్, అకౌంట్ నంబర్ వివరాలను ఈ నెల 10వ తేదీలోగా ఆయా మండలాల ఏఈవోలకు అందించాలని సూచించారు. ఆ తేదీ వరకు సీసీఎల్ఏ ద్వారా ధరణి పోర్టల్‌లో నమోదైన అర్హులైన ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడిసాయం జమచేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.