పిల్లల ఆరోగ్యంపై స్మార్ట్‌ ఫోన్ల ప్రభావాలు!

బ‌డులు బంద‌య్యాయి. చ‌దువులు అట‌కెక్కాయి. క్లాసు రూములు కాముగా ఉన్నాయి.. వీట‌న్నింటికి కార‌ణం క‌రోనా.. ఈ ఒక్క కొవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని త‌ల‌కిందుల చేసింది. ఈ వైర‌స్ విజృంభించ‌డంతో ప్ర‌పంచ దేశాలు అన్నీ బిక్కుబిక్కు మంటూ కాలం వెల్ల‌దీస్తున్నాయి. బ‌య‌ట‌కెళ్లాలంటేనే జ‌నం జంకుతున్నారు. వెళ్ల‌కుండా బ‌త‌క‌లేరు కాబ‌ట్టి మాస్కులు.. సానిటైజ‌ర్ల సాయంతో వారి వారి ప‌నులను చేసుకుంటున్నారు. మార్చి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే లాక్‌డౌన్ (మార్చి 21) కంటే ముందే మార్చి 19వ తేదీ నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. నిత్యం విద్యార్థుల ఎదుగుదలను కోరుకునే గురువుకు కరోనా కాలంలో ఎవరూ ఊహించని కష్టమొచ్చి పడింది. దేశ‌వ్యాప్తంగా వేల సంఖ్య‌లో బ‌డులున్నాయి. అవి ప్రైవేటు, ప్ర‌భుత్వం ఏవైనా కావ‌చ్చు.. ఈ స్కూళ్ల‌లో దాదాపు 30 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు విద్యార్థులు విద్య‌న‌భ్య‌సిస్తున్నారు. స‌ర్కారు బ‌డుల్లో చేసే ఉపాధ్యాయులు కాకుండా ప్ర‌వేటు పాఠ‌శాలల్లో దాదాపు 3 ల‌క్ష‌ల మంది ఉపాధ్యాయులు ప‌నిచేస్తున్నారు. ఇప్పుడు ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా దెబ్బ‌కు ఉపాధ్యాయుడు క‌కావిక‌ల‌మైపోతున్నాడు. ఇక విద్యార్థుల సంగ‌తి స‌రేస‌రి.. త‌ల్లిదండ్రుల‌కు దిక్కుతోచ‌టం లేదు.. పిల్ల‌ల భ‌విష్య‌త్‌పై తీవ్రంగా మ‌ద‌న‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మొద‌లైన ఆన్‌లైన్ క్లాసులు ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయో ఆ దేవుడికే తెలియాలి.

 

హైద‌రాబాద్ః  చ‌దువుల సంగ‌తేమో కాని ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారులు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ఇంట‌ర్నెట్‌ల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. వీటి వాడ‌కంపై త‌ల్లిదండ్రులు చాలా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కాలం పిల్ల‌ల‌ను ఫోన్ల‌కు దూరంగా ఉంచేవారు… ఇప్పుడేమో వారే ఫోన్ల‌ను వారి చేతిలో పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వాడ‌కం బాగా పెరింది. అయితే ఈ రకాల వైర్‌లెస్ పరికరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన అన్ని రకాల రేడియేషన్లతో పిల్ల‌లు ఎలా ఉంటార‌నేదే త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌ని ప్ర‌శ్న‌. ఈ ఆన్‌లైన్ క్లాసుల కాలంలో పిల్లలు చిన్న వయస్సులోనే టెక్నాలజీకి అల‌వాటుప‌డుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల వాడ‌కంతో పిల్లలు పూర్తిగా ఎదగలేదు అనే అపోహ‌లు చాలా ఉన్నాయి. పెరుగుతున్న లేత మనస్సులకు, పిల్ల‌ల‌ శరీరాలకు ఈ ఫోన్లు ఏమైనా హాని కలిగిస్తాయా అనే మీమాంస‌లో ఉన్నారంతా.

పిల్లపై సెల్ ఫోన్‌ ప్రభావము

మన దేశంలో సెల్ ఫోన్ ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు, ఎస్ ఎం ఎస్ లు అంటూ ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ ల వాడకం పెరిగిపోతుంది. ఇది బాగానే ఉందిగాని, ఈ సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనార్థల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని వారు పేర్కొంటున్నారు. గేమ్స్ ఆడడం, పాటలు వినడం , సినిమాలు చూడడంలో పిల్లలు సెల్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్ ఫోన్స్ ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు.

సెల్ ఫోన్ లు రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఆలోచనా శక్తి క్రమేపీ మోద్దుబారే ప్రమాదం ఏర్పడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

రేడియేష‌న్

మొబైల్ ఫోన్లు, ఇత‌ర‌ వైర్‌లెస్ పరికరాలు, మైక్రోవేవ్ రేడియేషన్లు, అయోనైజింగ్, నాన్-అయోనైజింగ్ రేడియేషన్ల ద్వారా వివిధ రకాల రేడియేషన్లు ఉత్పత్తి అవుతాయి. ఇంకా ఎక్స్‌రేలు, రాడాన్, సూర్యకాంతి యొక్క అతినీలలోహిత కిరణాలు వంటి అయోనైజింగ్ రేడియేషన్‌లు అధిక ఫ్రీక్వెన్సీ, అధిక శక్తి.నాన్-అయోనైజింగ్ రేడియేషన్లు ఫ్రీక్వెన్సీతో పాటు శక్తి తక్కువగా ఉంటాయి. సెల్ ఫోన్లు అయోనైజింగ్ కాని రేడియేషన్లను కలిగి ఉంటాయి.మొబైల్ ఫోన్లు రేడియో-ఫ్రీక్వెన్సీ తరంగాలను దాని ప్రసార యూనిట్ లేదా యాంటెన్నా నుండి సమీపంలోని సెల్ టవర్లకు పంపుతాయి. మనం కాల్ చేసినప్పుడు లేదా కాల్ అందుకున్నప్పుడు, సందేశాన్ని పంపినప్పుడు లేదా వచన సందేశాన్ని స్వీకరించినప్పుడు,లేదా డేటాను ఉపయోగించినప్పుడు, మన ఫోన్ సెల్ టవర్ల నుండి దాని యాంటెన్నాకు రేడియో-ఫ్రీక్వెన్సీ తరంగాలను అందుకుంటుంది.

ఇలా సెల్ ఫోన్లు మరియు ఇతర వైర్‌లెస్ పరికరాల నుండి వచ్చే మైక్రోవేవ్ రేడియేషన్ ఆరోగ్యానికి చాలా హానికరం. వీటి ద్వారా చిన్న‌ పిల్లలు, పుట్టబోయే శిశువులకు హానిక‌ర‌మ‌ని అనేక పరిశోధనలు నిరూపించాయి. ఇటువంటి వి కిరణాలు పిల్లలు మరియు పుట్టబోయే శిశువులలో శారీరక నష్టానికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయి. పెద్దవారి కంటే పిల్లలలో మైక్రోవేవ్ రేడియేషన్ శోషణ రేటు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారి మెదడు కణజాలాలు ఎక్కువ శోషించబడతాయి. ముఖ్యంగా వారి పుర్రెలు సన్నగా ఉంటాయి, అలాగే వారి సాపేక్ష పరిమాణం చిన్నదిగా ఉంటుంది. దాంతో పిండములకు ముఖ్యంగా మరింత హాని కలిగిస్తాయి, ఎందుకంటే మైక్రోవేవ్ రేడియేషన్ ఎక్స్పోజర్ మెదడు న్యూరాన్ల చుట్టూ ఉండే రక్షిత కోశం యొక్క క్షీణతకు దారితీస్తుంది.

స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలున్నా, దానిని అధికంగా వాడితే అనారోగ్యాలు తప్పవు. రోజులో 5 గంటలకు మించి స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. సిమోన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు 1060 మందిపై శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాల్లో ఇది విషయంలో వెల్లడైంది. స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తెల్చింది. ఆ విద్యార్థులకు గల ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను కూడా సైంటిస్టులు సేకరించారు. నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ ఫోన్‌ను వాడుతున్నారు అనే తదితర వివరాలను కూడా రాబట్టారు. ఈ పరిశోధనలలో చివరకు తేలిందేమిటంటే, నిత్యం 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఉన్నాయి తేలిపారు. వారికి 42.6 శాతం వరకు సమస్యలు ఎక్కువగా ఉంటాయని, అదే విద్యార్థినులు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు.

స‌ల‌హాలు:

  • 1. వీలైనంత వరకు చాలా తక్కువగా వికరణాలకి మాత్రమే గురికావాలి. దీని అర్థం ఏమిటంటే తెలివిగా వీలైనంత తక్కువ ఫోన్ లో మాట్లాడడము, అతి దీర్ఘమైన సంభాషణల్ని జరగకుండా మీరు ప్రయత్నించడం. రెండు నిమిషాల కాల్ తరువాత, మెదడు యొక్క ఎలక్ట్రికల్ ఏక్టివిటీస్/పనితీరు ఒక గంటవరకు మార్పుచేస్తుందని కనుగొన్నారు.
  • 2. సెల్ ఫోన్ ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే పిల్లలు ఉపయోగించడాన్ని అనుమతించాలి.
  • 3. మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించనప్పుడు, వీలైనంతవరకు మీ శరీరానికి దూరంగా ఉంచాలి. కొంతమంది సెల్ ఫోన్ ఉన్నవారు సెల్ ఫోన్ పనిచేస్తూ ఉండగా తమ పేంటు జేబులో పెడతారు. మానవ శరీరము యొక్క క్రింది భాగము, పై భాగము కన్నా చాలా త్వరగా వికరణాలని లీనం చేసుకుంటుంది.
  • 4. హెడ్ ఫోన్లని ఉపయోగించాలని అనుకున్నట్లైతే, వైర్డు హెడ్ సెట్ల కన్నా వైర్ లెస్ హెడ్ సెట్లని వాడండి. వైరు వికరణాన్ని ప్రసరించడమే కాకుండా ఏంటీనాలా కూడా పనిచేసి చుట్టుప్రక్కల ఉన్న ఎలక్ట్రోమేగ్నెటిక్ ఫీల్డులను (EMFs) ఆకర్షిస్తుంది. హెడ్ సెట్ లేకుండా మీరు సెల్ ఫోన్ ఉపయోగించినప్పుడు, మీ చెవి దగ్గరికి తీసుకునే ముందు కాల్ వచ్చే వరకు వేచి చూడాలి.
  • 5. మీరు సెల్ ఫోన్, హోల్ సేల్ లేదా ఒకొక్కరిగా అమ్మే వారి దగ్గర కొనేటప్పుడు తక్కువ ఎస్ ఎ ఆర్ (నిర్దుష్టమైన విలీన రేటు) ఉన్నది చూసుకుని ఎంచుకోవాలి.ఇన్సట్రక్షన్ మేన్యువల్ లో ఇచ్చిన ఎస్ ఎ ఆర్ నంబరుని చూడండి ఎంత తక్కువ ఎస్ ఎ ఆర్ విలువ ఉంటే అంత మంచిది.
  • 6. ఎలివేటర్లు/ లిఫ్టులు లేదా వాహనాలు వంటి, మూసివేసిన మెటల్ స్పేసులలో వికరణం ఉధృతంగా ఉంటుంది కాబట్టి కాల్స్ ని తీయకుండా ఉండండి.
Leave A Reply

Your email address will not be published.