పుకార్లు న‌మ్మొద్దు..

శివాత్మికా రాజశేఖర్ మ‌రో ట్వీట్‌

హైద‌రాబాద్‌: హీరో శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై తాజాగా వ‌స్తోన్న పుకార్లు న‌మ్మొద్ద‌ని ఆయ‌న కుమార్తె శివాత్మిక ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా రాజ‌శేఖ‌ర్ కోవిడ్‌తో పోరాడుతున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే శివాత్మిక ఆయ‌న ఆరోగ్య విష‌యం తెలియ జేస్తూ గురువారం ట్విట్ట‌ర్‌లో కొన్ని ట్వీట్లు పెట్టారు. `కోవిడ్‌తో నాన్న పోరాటం చేస్తున్నారు. అభిమానుల ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం అనుకంటున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని దయచేసి ప్రార్థనలు చేయండి. మీ అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు` అని శివాత్మిక తొలుత పోస్టులో తెలిపింది.

ఈ పోస్టుతో చూసి అభిమానులు కంగారు ప‌డ్డారు. దీంతో ఆమె వెంట‌నే మ‌రో ట్వీట్ చేస్తూ.. ` మీరు చేస్తున్న ప్రార్థ‌న‌ల‌కు ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో నాకు అర్థం కావ‌డం లేదు. ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా లేదు. స్థిరంగా ఉంది. ద‌య‌చేసి ఈ విష‌యాన్ని అర్థం చేసుకోండి. కృత‌జ్ఞ‌త‌లు.. అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయ‌కండి` అని పేర్కొంది. రాజ‌శేఖ‌ర్ కుటుంభం అంతా కొవిడ్ భారిన ప‌డిన విష‌యం తెలియ‌జేస్తూ ఈ నెల 17న ఆయ‌న ఒక పోస్టు చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.