పూజా హెగ్డేకు కరోనా..
కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పూజాహెగ్డేనే స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపారు.
“నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని మీకందరికీ చెప్పాలని అనుకున్నాను. నిబంధనలను పాటిస్తూ స్వీయ నిర్భందంలోకి వెళ్లాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ ఇంట్లోనే ఉండండి. కరోనా నుంచి కాపాడుకోండి ” అంటూ పూజాహెగ్డే ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
🙏🏻😷 pic.twitter.com/fwdd9Cq1Go
— Pooja Hegde (@hegdepooja) April 25, 2021