పెరిగిన బంగారం ధరలు

హైద‌రాబాద్‌: గ‌త‌ కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి వ‌ర‌కు తగ్గిన బంగారం ధ‌ర‌తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ద‌ర‌ల పెరుగుద‌ల‌తో.. బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి ఎగసి రూ. 46,090 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 42,250 కు చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ. 71,800 కు చేరుకుంది.

Leave A Reply

Your email address will not be published.