పేలుడు బాధితులకు పరిహారం : ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

సంగారెడ్డి : బొల్లారం పారిశ్రామిక వాడలోనీ వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమను పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు పరిహారం ఇప్పిస్తామన్నారు. కెమికల్ సాల్వెంట్ పేలుళ్లతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తుంది. ప్రమాద సమయంలో 120 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. భారీ పేలుళ్ల శబ్దాలతో పరిశ్రమలోని కార్మికులు భయాందోళనతో ఉరుకులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఏనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని మమత ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు.