పొట్టి వీరయ్య ఇకలేరు

హైదరాబాద్‌  (CLiC2NEWS): సినీ నటుడు పొట్టి వీరయ్య (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారని బంధువులు తెలిపారు. ఆయన అసలు పేరు గట్టు వీరయ్య. విఠ‌లాచార్య `అగ్గిదొర` చిత్రంతో న‌టుడిగా తెలుగు సినిమాకు పరిచ‌యం అయ్యారు. దాస‌రి ప్రోత్సాహంతో తాత‌మ‌న‌వ‌డు చిత్రంలో కీల‌క పాత్ర పోషించారు.

ఆయన స్వస్థలం నల్గండ జిల్లా సూర్యాపేట తాలుకా ఫణిగిరి గ్రామం. హై స్కూల్‌ వరకూ చదువుకున్నారు. స్కూల్లో, వేదికలపై పలు నాటకాలు వేశారు. అనంతరం నటుడు కావాలనే ఉద్దేశంతో మద్రాసు వచ్చేశారు. తొలుత సినిమాలకు డెకరేషన్‌ చేసే ఫ్లవర్‌ షాపులో కొంతకాలం పనిచేశారు. ఈ సమయంలో నటుడు శోభన్‌బాబు పరిచయం..ఆయన్ను సినిమాల్లో వేషం వచ్చేలా చేశాయి. అలా ఆయన సినిమా ప్రస్థానం మొదలైంది. విఠలాచార్య అగ్గి వీరుడుసినిమా రంగంలోకి ప్రవేశించిన ఆయన..అనేక చిత్రాల్లో నటించారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఆయన అంత్యక్రియలు జుబ్లీహిల్స్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. వీర‌య్య భార్య మ‌ల్లిక 2008లో క‌న్నుమూశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, చిన్న కుమార్తె విజ‌య‌దుర్గ సినిమాల్లోనూ న‌టించారు.

Leave A Reply

Your email address will not be published.