పొలంలో దొరికిన ఖరీదైన వజ్రం!

కర్నూలు: రాయలసీమ రతనాల సీమ అన్నారు. శ్రీ కృష్ణదేవరాయల పాలనలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారు అని మనం చరిత్రలో చదువుకున్నాం… కానీ ఇప్పటు రాయల సీమలో వజ్రాలు దొరకుతున్నాయి. తాజాగా జిల్లాలో విలువైన వజ్రం దొరికింది. జిల్లాలోని తుగ్గలి మండలానికి చెందిన ఓ మహిళకు పొలంలో వేరుశెనగ తీస్తుండగా కోటి రూపాయలు విలువ చేసే వజ్రం దొరికింది. అయితే వజ్రాన్ని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగులు చేశారు. రూ.11 లక్షల రూపాయలు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ వ్యాపారి వజ్రాన్ని కొన్నట్లు తెలిసింది. కాగా.. ఈ వజ్రం కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుందని స్థానికులు అనుకుంటున్నారు.