ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ అందించాడు. డార్లింగ్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు నేడు. `రాధేశ్యామ్` మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.. కాగా బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ కు అంత‌ర్జాతీయ స్థ‌యిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్` పేరుతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 1.16 నిమిషాల నిడివి ఉన్న ఈ పోస్టర్‌లో ముందుగా అర చేయి కనిపిస్తుంది. దాంట్లో అడవి.. అందులో రైలు. ఒపెన్‌ చేస్తే ఫస్ట్‌ రోమియో-జులియేట్‌, తర్వాత సలీం-అనార్కలీ, తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజా హెగ్డే రైలు బోగి డోర్‌ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్‌ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. ఇదంతా చూస్తుంటే ఓ ట్రైన్‌లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథగా రాధేశ్యామ్‌ తెరకెక్కినట్లు తెలుస్తోంది. `సాహో` తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ పీరియాడిక్ లవ్‌స్టోరీ అని సమాచారం. ఇక ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.