TNR: క‌రోనాతో క‌న్నుమూత‌

హైద‌రాబాద్‌(CLiC2NEWS): ప్ర‌ముఖ యూట్యూబ్ యాంక‌ర్‌, జ‌ర్న‌లిస్టు, న‌టుడు TNR(తుమ్మల నరసింహారెడ్డి) క‌రోనాతో క‌న్నుమూశారు. కొన్ని రోజుల కింద‌ట ఆయ‌న క‌రోనా బారిన‌ప‌డ‌గా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్ పై వైద్యం అందించినా.. ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. ఆయన ఆరోగ్యం మరింత చేయి దాటడంతో టీఎన్ఆర్ మృతి చెందారు. కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో టీఎన్ఆర్ మృతి చెందారు. ఆయన మృతి వార్తా వినగానే..ఇటు జర్నలిస్ట్ లోకం, అటు చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్ళింది. యూ-ట్యూబ్ ప్రసారమయ్యే ఫ్రాంక్లి విత్ టీఎన్ఆర్ షోతో ఆయన బాగా పాపులర్ అయ్యారు.

అథితులు సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా ఆయ‌న ప్ర‌శ్న‌లు సూటిగా ఉండేవి. అంతేకాదు, న‌టుడిగానూ TNR త‌న‌దైన ముద్ర‌వేశారు. ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ఇక ఆయన మృతి పట్ల.. తెలుగు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రముఖ సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరోనాతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసి హీరో నాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ”TNR కన్నుమూశారని తెలిసి షాకయ్యా. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి మనసులో మాటలను జనానికి వినిపించిన ఆయన మరణం బాధాకరం” అని నాని పేర్కొన్నారు.

టీఎన్ఆర్ అకాల మ‌ర‌ణం ఎంతో బాధ క‌లిగించింది. మంచి మ‌న‌స్త‌త్వం ఉన్న మ‌నిషి. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను అని అనీల్ రావిపూడి ట్వీట్ చేశారు. గోపిచంద్ మ‌లినేని, ద‌ర్శ‌కుడు మారుతి, సందీప్ కిష‌న్ సంతాపం తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.