ప్రభాస్ `సలార్`కు డేట్ ఫిక్స్

బాహుబలితో ప్రపంచ వ్తాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ అప్డేట్ రానే వచ్చింది. సలార్ జనవరి చివరి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సలార్ జనవరి 15న ముహూర్తం పూజను నిర్వహించనున్నారు. సలార్ షూటింగ్ ప్రారంభిస్తుండటం, అభిమానులకు లుక్ విడుదల చేస్తుండటం పట్ల చాలా ఎక్జయిటింగ్ గా ఉందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
కాగా ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ తో పాటు సలార్, ఆదిపురుష్ చిత్రాలతో నటిస్తున్నాడు. కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్‌నారాయణ్ సీఎన్, దర్శకుడు రాజమౌళి, కన్నడ సూపర్ స్టార్ యశ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రానున్నారు. హైదరాబాద్ లో సలార్ ముహూర్తపు పూజ జరుగనుంది.