పది పరీక్షల షెడ్యూల్ ఖరారు
మే 17 నుంచి పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో పదో తగరతి పరీక్షలను మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు నిర్వహించనున్నమని ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా నాలుగు ఎఫ్ఏ(ఫార్మెటివ్ అసెస్‌మెంట్) టెస్టులకు గానూ రెండు ఎఫ్ఏ టెస్టులను మాత్రమే నిర్వహించనున్నారు.
కాగా రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. పది పరీక్షలు ముగిసిన మరుసటి రోజు (మే 26) నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అలాగే 9, 10వ తరగతుల విద్యార్థులు స్కూల్‌కు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు, హైదరాబాద్ జిల్లాలో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 204 పని దినాలు ఉన్నాయి.